పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ కు చెందిన వంగపాటి నాగరాజు(53) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం కొత్తపల్లిలో ఒక ఫంక్షన్ హల్ లో పాము పట్టే క్రమంలో పాము అతడిని కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.