పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరులో 49 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలాన్ని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ అనే వ్యక్తి అక్రమంగా నిషేధిత ఆల్ఫాజోలాన్ని తరలిస్తున్నాడని సమాచారంతో ఎస్ఐ, రెక్కి నిర్వహించి అతడిని పట్టుకొని విచారించారు. గోపాల్ గౌడ్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, అతడి వద్ద నిషేధిత ఆల్ఫాజోలం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.