మెదక్ జిల్లా వెంకట్రావుపేట్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిద్ర మత్తులో ఉన్న కారు డ్రైవర్ రాంగ్ రూట్లోకి వెళ్లి ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. బైక్ ఢీ కొట్టటంతో ఉన్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.