నర్సాపూర్‌: కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

71చూసినవారు
నర్సాపూర్‌: కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సాపూర్‌లో సోమవారం జరిగింది. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయమ్మ నాలుగేళ్ల కొడుకుతో రాయరావు చెరువులోకి దిగుతుండగా వాచ్‌మెన్ రమేష్ గమనించి పోలీసులకు చెప్పాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి తల్లి, కొడుకును రక్షించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని ఎస్ఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్