పాపన్నపేట మండలానికి చెందిన ఆవుసుల రాములు(40), భార్య సరళకు కొద్దిరోజులుగా గొడవలు జరగడంతో సరళ పిల్లలను తీసుకుని నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది. అప్పటి నుండి రాములు దిగులుగా ఉంటున్నాడు. బుధవారం మనస్తాపానికి గురైన రాములు స్థానికంగా ఒక గుడి సమీపంలో విషం తాగి మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.