మెదక్ జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. మెదక్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడనున్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా బుధవారం కూడా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి.