షాపుల్లో దొంగతనం కలకలం

54చూసినవారు
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని మణికంఠ ట్రేడర్స్, ఎమ్‌ఆర్ చాయ్ సెంటర్‌లో ఒక వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. షాపు వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగ బిరువాలోని రూ.25వేలు నగదు, టీవీ, మిక్సీ చోరీ చేశాడు. ఉదయం చోరీ విషయాన్ని గమనించిన షాప్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్