మెదక్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్జీ దారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రజలు కలెక్టరేట్ కు తరలి వచ్చారన్నారు. రైతు రుణ మాఫీ, పింఛన్లు, ఉపాధి, డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు, భూ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశారన్నారు.