తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ చేసిన ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రేగుల ఎల్లవ్వ, పంపరి స్వరూప మహిళలు తమ ఇంటికి తాళాలు వేసి వేరే గ్రామానికి వెళ్ళగా.. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వెండి, బంగారు నగలతో పాటు కొంతమేర నగదు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు.