సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నారాయణఖేడ్ పట్టణంలోని SC కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మాధవి అనే విద్యార్థిని గురువారం హాస్టల్ భవనం మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో మాధవికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.