కల్హేర్: పిడుగుపాటుకు యువ రైతు మృతి

59చూసినవారు
కల్హేర్: పిడుగుపాటుకు యువ రైతు మృతి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది.స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం రవి సాయంత్రం పశువులకు పచ్చి గడ్డి తీసుకు రావడానికి గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లోకి వెళ్లాడు. పచ్చి గడ్డి కోస్తున్న తరుణంలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్