నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి దూకి తల్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివకుమార్ కదరం ప్రకారం నిజాంపేట మండలం ముణికేపల్లికి చెందిన ప్రమీల (30), కుమారుడు అక్షయ్ (8) బ్యాంకుకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.