నారాయణఖేడ్ పట్టణంలోని అతి పురాతనమైన కాశీ విశ్వనాథ్ దేవాలయంలో మహా అద్భుతం చోటుచేసుకుంది. ఆలయ పురోహితులు గురురాజ శర్మ ప్రవచనంలో నారాయణఖేడ్ కాశీ విశ్వనాథుడి మహిమ, వైభవం గురించి భక్తులకు ఆయా సందర్భాలలో వివరించారు. ఉత్తరాయణ కాలంలో సూర్యకిరణాలు స్వామిని తాకుతాయని చెప్పారు. అదేవిధంగా ఆదివారం ఉదయం సూర్య కిరణాలు కాశీ విశ్వనాథ స్వామి వారిని తాకాయి. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు.