మహిళ అదృశ్యమైన ఘటన కల్హేర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్సై వెంకటేశం కథనం ప్రకారం మండలంలోని బిబిపేటకు చెందిన కుమ్మరి సునీత ఈనెల 12వ తేదీన సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు వెతికిన ఆచూకీ లభించకపోవడంతో వారి భర్త కుమ్మరి సాయిలు ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మీడియాతో తెలిపారు.