రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందిన ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గం బాచేపల్లి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రేగోడు మండలం పట్టే పొలం తండాకు చెందిన తల్లి సక్రీబాయి కొడుకు సుభాష్ బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.