విధి నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ లో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే భావి భారత పౌరులు ఎదుగుతారని చెప్పారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడే పని చేసి ఈ ప్రాంత విద్యార్థులకు బోధించాలని కోరారు.