మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం అశోక్ గౌడ్ అధ్యక్షతన ప్రభుత్వ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపును జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఆసుపత్రి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో డాక్టర్లు, వైద్య బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.