నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్ పరిధి దుర్గా తండాకు చెందిన మెగావత్ శివరాం(44) కౌడిపల్లి ఠాణాలో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం తన బైక్ పై మెదక్ భరోసా కేంద్రానికి వెళ్తుండగా. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనగా శివరాం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివరాం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.