మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలో భారీ వర్షాలతో చెరువు అలుగు పారడంతో బుధవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.