వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో సందడి వాతావరం నెలకొంది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్ది నెలకొంది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి, స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.