సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 43 లక్షల 94 వేల రూపాయల విలువైన చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, నగేష్ యాదవ్, నరసింహారెడ్డి, వెంకటేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.