గురువులు విద్యార్థుల భవిష్యత్తు మార్గదర్శకులని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. టీచర్స్ డే ని పురస్కరించుకొని పటాన్చెరు మండలం చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్టలేనిదని అన్నారు.