సిగాచి పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో మరణించిన 42 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిని ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మరో 8 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. మానవ శరీరాల అప్పగింత సజావుగా జరగాలని సూచించారు.