పాశమైలారంలోని సిగాచి పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఆదివారానికి 43 కి చేరింది. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతులకు పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఏడవ రోజు కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. తమ వాళ్ళ శవాలను ఎప్పుడు అప్పగిస్తారని కుటుంబ సభ్యులు ఆసుపత్రుల వద్ద ఎదురు చేస్తున్నారు.