వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కొండాపూర్ సీఐ చంద్రయ్య తెలిపారు. పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూర్ నగర్ మండలం సూర్యాపేటకు చెందిన ఆంజనేయులు తాపీ పని చేస్తు రాత్రి దొంగతనాలు చేసేవాడని చెప్పారు. 14. 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితున్ని రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.