సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని కోరుతూ ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ బోధన ఆస్పత్రిగా మార్చిన తరువాత రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాత్, సాయి, రాజు పాల్గొన్నారు.