హైడ్రా పై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని వివరాలు చెప్పాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. హైడ్రా పై అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అందరి సందేహాలు నివృత్తి అవుతాయని చెప్పారు. హరీష్ రావు మైనంపల్లి హనుమంతరావు పంచాయతీ వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు.