సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు పూలు పూలు పేర్చి బతుకమ్మను అందంగా తయారు చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.