నలుగురు దొంగల అరెస్టు..29 తులాల బంగారం స్వాధీనం

66చూసినవారు
సంగారెడ్డిలో నలుగురు దొంగల ముఠాను అరెస్టు చేసి 29 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి సత్తయ్య కూడా తెలిపారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బైపాస్ రహదారిపై అనుమానాస్పదంగా కనిపించిన యాదగిరి, లక్ష్మి, అనిత, మరో మైనర్ బాలుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బంగారంతో పాటు 47 తులాల వెండి, 4 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్