శాంతి, అహింస మార్గంలో దేశానికి గాంధీ స్వాతంత్రం తీసుకువచ్చారని అదనపు ఎస్పీ సంజీవరావు అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీజీ పోరాటానికి కోట్ల మంది ఆకర్షితులయ్యారని చెప్పారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.