హోంగార్డులంటే అధికారులకు చులకనగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మల్కాపూర్ పెద్ద చెరువులో భవనం కూల్చివేతలో గాయపడిన హోంగార్డు గోపాల్ ను హైదరాబాద్ లోని ఆసుపత్రిలో మంగళవారం పరామర్శించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులైన ఒక్క పోలీస్ ఉన్నత అధికారి కూడా ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. హోంగార్డు చికిత్స కోసం లక్ష రూపాయల సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.