వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సంగారెడ్డిలో ముస్లింలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మదీనా చౌరస్తా నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.