మునిపల్లి మండలం కంకల్ టోల్ ప్లాజా వద్ద 765 గ్రాములు ఎండు గంజాయి శనివారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ శంకర్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి బీదర్ కు బస్సులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వకీల్ యాదవ్ అనే వ్యక్తి గంజాయి తరలిస్తుండగా తనిఖీలో పట్టుబడినట్లు చెప్పారు. వకిల్ యాదవ్ ను అరెస్టు చేసి మునిపల్లి పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.