ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఈనెల మూడు నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2: 30 నుంచి 5: 30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. పదవ తరగతికి 319, ఇంటర్ కు 733 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. పదో తరగతికి జడ్పీ బాలికల, ఇంటర్ కు ప్రభుత్వ బాలుర పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.