పటాన్‌చెరు: సిగాచి ఘటన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి

3చూసినవారు
పటాన్‌చెరు: సిగాచి ఘటన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి
పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సిగాచీ పరిశ్రమలో శిథిలాల తొలగింపు ఆరో రోజు కొనసాగుతోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది భవన శిథిలాలు తొలగిస్తున్నారు. మరోవైపు పటాన్‌చెరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్‌ చౌదరి శనివారం మృతి చెందారు. దీంతో భారీ పేలుడులో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 40కి పెరిగింది.

సంబంధిత పోస్ట్