సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మరో 3 మృతదేహాల వివరాలను గుర్తించారు. ఇద్దరు బిహార్, ఒకరిని ఒడిశా కార్మికులుగా అధికారులు శనివారం గుర్తించారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిగాచీ బాధితుల కోసం ఘటనాస్థలికి బిహార్ నేతలు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.