సంగారెడ్డి: భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

61చూసినవారు
సంగారెడ్డి: భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను ఘోరంగా కడతేర్చాడు ఓ కసాయి భర్త. జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్‌చెరు పెద్దకంజర్ల వాసి రమీలాతో ఐదేళ్లక్రితం పెళ్లి జరిగింది. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో కొట్టి సోమవారం అంతమొందించాడు.

సంబంధిత పోస్ట్