నాగల్గిద్ద మండలంలో నిండు గర్భిణీ జయశ్రీ (23) వైద్యం అందక చనిపోయిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఇరక్ పల్లి లాక్యనాయక్ తండాకు చెందిన జయశ్రీని కరసుత్తి ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు నారాయణఖేడ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు సంగారెడ్డికి పంపించారు. దారిలో ఫిట్స్ వచ్చి జయశ్రీ చనిపోయిందని, ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె బంధువులు ఆరోపించారు.