పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరింది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆచూకీ లేని తమ వారి గురించి చెప్పాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.