సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామంలో సోమవారం జరిగిన నరేంద్ర చార్య పాదుక దర్శనంలో సుడిగాలి బీభత్సంతో టెంట్లు కుప్పకూలాయి. ఇందులో 30 మందికి గాయాలయ్యాయి. వీరికి 108 అంబులెన్స్ లో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరికి కాలు, చెయ్యి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.