గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 121 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అవార్డులను అందిస్తామని చెప్పారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అభినందించారు.