ఉపాధ్యాయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను గురువారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.