పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన బస్వాపూర్ గ్రామానికి చెందిన జయమ్మ గొంతు పిసికి అనిల్ కుమార్ వినీత్ లు చంపేశారు. పెట్రోల్ పోసి శవాన్ని తగల బెట్టి చింతకుంట మంజీర నదిలో బ్రిడ్జిపై నుంచి కింద పడేశారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.