మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టు జరిమానా విధించిందని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో 14మంది పట్టుబడ్డారు. వారిని సోమవారం కోర్టులో హాజరు పర్చగా సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు వారికి రూ. 22, 500 జరిమానా విధించినట్లు తెలిపారు.