78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపటి గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్ పంచాయతీ కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. రాగి ఆకులతో తయారుచేసిన రాఖీలను మహిళలు గ్రామపంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బందికి కట్టారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఐలయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.