పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలో 91. 26శాతంతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ అధికారి శుక్రవారం తెలిపారు. జిల్లాలో 183మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 167 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు.