జిల్లావ్యాప్తంగా 5 సంవత్స రాలలోపు వయసు ఉన్న చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జిల్లా వైద్య, సంక్షేమ శాఖ విభాగాలు ప్రత్యేక చొరవ చూపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి శుక్రవారం అన్నారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖ సమన్వయంతో జిల్లాలోని వైద్యాధికారులు, సీడీపీఓలు, వైద్యశాఖ సూపర్వైజర్స్, సంక్షేమ శాఖ సూపర్వైజర్స్ తో కలిసి ఆయన అనుబంధ పోషకాహారంపై అవగాహన సమావేశం నిర్వహించారు.