
నా జీవితం తెరిచిన పుస్తకం: బాలకృష్ణ
AP: ‘నా జీవితం తెరిచిన పుస్తకం. రహస్యాలేమీ ఉండవు. నా ప్రతీ అడుగు అందరికీ తెలుసు’ అని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ తనకు తండ్రి మాత్రమే కాదని, ఆరాధ్య దైవమని చెప్పారు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. నటనపరంగా తనకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పటికీ.. తాను చేసిన సేవల ప్రతిఫలంగానే అది దక్కిందని భావిస్తున్నానని చెప్పారు.