బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టీజీబీసీ స్టడీ సర్కిల్ సిద్దిపేట డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ హైద్రాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తయి 26 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులని, అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 12 నుంచి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.