ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వైశ్యులు రానున్న ఎన్నికల్లో పోటీచేయాలన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని వైశ్యులకు కేటాయిస్తే వారి గెలుపునకు తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు.